- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులే.. ఎందుకో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: శాసన సభ సమావేశాలు రెండ్రోజులు మాత్రమే జరుగనున్నాయి. ఈ నెల 12, 13తేదీలలో నిర్వహించేలా బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్‌లో సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ నెల 12, 13 తేదీల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16 నుండి మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైఖ్యతా ఉత్సవాలు ఉన్నందున సెప్టెంబరు 12,13 తేదీల్లో శాసనసభ నిర్వహించాలని నిర్ణయం తిసుకున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఉప సభాపతి టి.పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్ఐఎమ్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
మండలి సేమ్...
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన శాసన మండలి ప్రాంగణంలోని మినిస్టర్ లాంజ్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12, 13 తేదీల్లో శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మినిస్టర్ సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు జాఫ్రీ, జనార్దన్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహా చార్యులు పాల్గొన్నారు.