- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో 'గుజరాత్ మోడల్' మంత్రం
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలనాథులు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగా వ్యూహరచన చేపట్టడంపై కసరత్తులు ప్రారంభించారు. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో హ్యాట్రిక్ కొట్టాలంటే ఈ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. అందుకే ఈ 9 రాష్ట్రాల్లో గెలుపు కోసం నేతలు అహర్నిశలు శ్రమించాలని డిసైడ్ అయ్యారు. గుజరాత్ మోడల్ మంత్రంతో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడుసార్లు గెలుపొంది రికార్డు సృష్టించింది. ఇదేమీ అంత ఆషామాషీ విషయం కాదని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అందుకే గుజరాత్ మోడల్‌నే ఆదర్శంగా అన్నిరాష్ట్రాలకు చూపించాలని హైకమాండ్ కాషాయ నేతలకు దిశానిర్దేశం చేసింది.
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. అందులో భాగంగా తొలుత నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అంతేకాకుండా ఈ ఏడాది చివరికల్లా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణలో ఎలక్షన్ ఉండనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం వచ్చే ఎలక్షన్స్ పై భారీగా పడే అవకాశముంది. అందుకే కాషాయదళం ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికలను ఎంతో సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రజలకు చేరువయ్యేందుకు మార్గాల అన్వేషణను కొనసాగించాలని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో జాతీయ నేతలు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా సంస్థాగతంగా బలోపేతమైతే తిరుగులేని శక్తిగా ఎదుగుతామని విశ్వసిస్తున్న బీజేపీ ఆ ఫార్ములానూ రాబోయే ఎన్నికల్లో అమలు చేయాలని డిసైడ్ అయింది.
సాధారణంగా వరుసగా ఒకే పార్టీ రెండు, మూడు సార్లు అధికారంలోకి వస్తేనే ఓటర్లు విసుక్కుని మరొకరికి అవకాశం ఇద్దామనుకునే రోజులివి. అలాంటిది గుజరాత్‌లో వరుసగా ఏడుసార్లు అధికారంలోకి రావడం అంత సామాన్యమైన విషయం కాదని బీజేపీ జాతీయ నేతలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కు వెళ్లిన వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు కలిపి 47 శాతం ఓట్లు వస్తే ఒకే పార్టీకి 53 శాతం ఓట్లు రావడం కూడా పెద్ద విషయమే. అక్కడి ప్రజలు బీజేపీకి ఎందుకు ఇన్నిసార్లు మద్దతు తెలిపి గెలిపిస్తున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హైకమాండ్ సూచించినట్లు టాక్. అంతేకాకుండా గుజరాత్‌లో జరిగిన అభివృద్ధిని, బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని హైకమాండ్ సూచించింది. అన్ని రాష్ట్రాల నేతలు ఒక్కసారి గుజరాత్‌ను విజిట్ చేసి అక్కడి డెవలప్ మెంట్‌ను చూడాలని జాతీయ నాయకత్వం నేతలకు సూచించింది. ప్రధానంగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే 9 రాష్ట్రాల నేతలు కచ్చితంగా వెళ్లి అధ్యయనం చేస్తే వాస్తవికత తెలుస్తుందని, అభివృద్ధి ఎంతమేర జరిగిందో ఒక అంచనాకు రావొచ్చని తెలిపింది. ఇది భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలకు ఉపయోగపడుతుందని వివరించినట్లు టాక్. అందులో భాగంగా గుజరాత్ పర్యటనకు తెలంగాణకు చెందిన నేతలు త్వరలో వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే గుజరాత్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి పలువురు నేతలు వెళ్లి వచ్చారు. ఈసారి వారు కాకుండా ఇతరులు వెళ్లే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో గెలుపు పంజా వేద్దామనుకున్న బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
Also Read...