- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇచ్చంపల్లి నుంచి వద్దు.. గోదావరి-కావేరీ లింకింగ్‌పై తెలంగాణ రిక్వెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన గోదావరి-కావేరీ నదుల అనుసంధానానికి తెలంగాణలోని ఇచ్చంపల్లిని కాకుండా సమ్మక్క ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలని జాతీయ నీటి అభివృద్ధి ఏజెన్సీకి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ ప్లాన్ ప్రకారం సిమ్యులేషన్ స్టడీని నిర్వహించాలని కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం గోదావరి నదిలో తెలంగాణకు దక్కిన 968 టీఎంసీల వాటాలో 50% కేటాయించాల్సిందేనని స్పష్టం చేసింది. కృష్ణా జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 1050 టీఎంసీల నీటి వాటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ నిర్ణయం జరిగిన తర్వాతనే నాగార్జునసాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పరిగణించాలని, అప్పటివరకు వద్దని తెలంగాణ స్పష్టం చేసింది. జలసౌధలో సోమవారం జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశానికి హాజరైన రాష్ట్ర ఇంజనీర్-ఇన్-చీఫ్ అనిల్ కుమార్ తన వాదనలను వినిపించారు.
సమగ్ర నివేదిక అందజేత
గోదావరి-కావేరీ అనుసంధానంపై మార్చి 6వ తేదీ న తెలంగాణ స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేసిందని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నదని ఈ-ఇన్-సీ తెలిపారు. నదుల అనుసంధానం ప్రాసెస్‌తో తెలంగాణకు గోదావరి నీటి కేటాయింపుల నిర్ణయంపై ఎలాంటి ప్రభావం పడకూడదని, అందువల్లనే 968 టీఎంసీలలో 50% తెలంగాణకు ఇచ్చిన తర్వాతనే దీనిపై స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని నొక్కి చెప్పారు. గోదావరి-కావేరీ అనుసంధానంపై తెలంగాణ తన అభిప్రాయంతో పాటు స మ్మక్క, సీతారామ ప్రాజెక్టుల అంశాన్ని వివరించిందని, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా స మర్పించిందని గుర్తుచేశారు. సమ్మక్క ప్రాజెక్టు కు ఎగువన 24 కి.మీ దగ్గరున్న ప్రాంతం న దుల అనుసంధానానికి అనువైనదని వివరించా రు. మొత్తం 150 టీఎంసీలలో 70 టీఎంసీలు, సీతారామకు, 30 టీఎంసీలు దేవాదులకు, 50 టీఎంసీలు సమ్మక్క బ్యారేజ్‌కు ఉంటాయని వివరించారు.
నిర్ణయం తరువాతే స్పష్టత
తెలంగాణ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాల (తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు)తో త్వరలో నే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌డ బ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు. గోదావరి-కావేరీ బేసిన్ రాష్ట్రాల ప్రతినిధులతో కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
- Tags
- Telangana: