Avinashreddy Bail Pettition: వాడివేడిగా వాదనలు.. విచారణ వాయిదా

by srinivas |   ( Updated:2023-04-27 13:00:44.0  )
Avinashreddy Bail Pettition:  వాడివేడిగా వాదనలు.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరిన అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాడివేడిగా జరిగింది. ఎంపీ అవినాశ్, వైఎస్ సునీత లాయర్ల మధ్య గంట పాటు వాదోపవాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది.

అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు

వివేకా కేసులో దస్తగిరినే హంతకుడని, స్వయంగా పాల్గొన్నారని అవినాశ్ రెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపించారు. అలాంటి దస్తగిరి స్టేట్మెంట్‌ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. అలాగే గూగుల్ టేకవుట్ ఎలా ఆధారమవుతుందన్నారు. దస్తగిరి ఫస్ట్ ఇచ్చిన వాగ్మూలంలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు లేవని, రెండో స్టేట్‌మెంట్‌లో ఎలా వచ్చాయన్నారు. అవినాశ్ రెడ్డి టార్గెట్‌గా సీబీఐ దర్యాప్తు జరుగుతోందని అవినాశ్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించారు.

సునీత తరపు లాయర్ల వాదనలు ఇవే..

అటు వైఎస్ సునీత తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. హత్య కేసులో ఉన్న వ్యక్తి ముందస్తు బెయిల్ ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటే విచారణ సంస్థ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు విషయాన్ని ధర్మాసనం ముందు వినిపించారు.

Read more:

Viveka Murder Case: అన్నీ ఆయనకు తెలుసు.. అవినాశ్ రెడ్డి (Video) వైరల్

Advertisement

Next Story

Most Viewed