- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ విషయాల్లో కోర్టుల జోక్యం చేసుకోరాదు.. హైకోర్టులో దానం, కడియం తరపున లాయర్లు
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దానం, కడియం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను లాయర్ మయూర్ రెడ్డి చదివి వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్ పై నిన్నటి విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలపై అనర్హత కు సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులకు సమీక్షించే అధికారం ఉంటుందని ఏజీ నిన్న హైకోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story