- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
The Greatest of All Time: 'ది గోట్' సినిమాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ నటుడు విజయ్(Vijay) హీరోగా గురువారం విడుదలవుతున్న చిత్రం 'ది గోట్'(The Greatest Of All Time) పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా అదనపు షోస్ వేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకు వస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అదనపు షో వేయడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. విడుదలైన రోజు ఉదయం 4 గంటల షో కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైదరాబాద్(Hyderabad) లోని కేవలం 15 థియేటర్లకు మాత్రమే ఈ అదనపు షో అనుమతి ఇస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. వెంకట ప్రభు దర్శకత్వంలో, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ప్రశాంత్, వైభవ్, లైలా, స్నేహ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో.. ప్రత్యేక టెక్నాలజీ ద్వారా దివంగత నటుడు విజయ్ కాంత్ కూడా ఓ పాత్ర పోషించాడని సమాచారం.