గవర్నర్ తమిళిసై భద్రాచలం పర్యటన ఖరారు

by GSrikanth |   ( Updated:2023-05-10 11:48:03.0  )
గవర్నర్ తమిళిసై భద్రాచలం పర్యటన ఖరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గురువారం ఉదయం 7 గంటలకు ఆమె బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి 8.30 గంటలకు భద్రాచలం కోరుకుంటారు. అక్కడ శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకృష్ణమండలంలో ఏర్పాటు చేసే హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో తమిళిసై పాల్గొంటారు. ఆ తర్వాత గిరిజన అభ్యుద భవన్‌లో జరిగే కార్యక్రమంలో గిరిజనులతో ఆమె ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. ఇక గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె పర్యటించే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read...

ఆత్మహత్యలు చేసుకోకుండా తల్లిదండ్రులు మనోధైర్యం ఇవ్వాలి: సబితా ఇంద్రారెడ్డి

Advertisement

Next Story