- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్తగా పెళ్లిచేసుకునే వారికి శుభవార్త.. తులం బంగారం ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు స్టార్ట్!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ‘ఇందిరమ్మ కానుక’ అమలుపై కసరత్తు ప్రారంభమైంది. నిరుపేద ఆడపడుచులకు వివాహ సమయంలో రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలెట్ చేసింది. దీన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని క్షేత్రస్థాయి లీడర్ల నుంచి ప్రపోజల్స్ రావడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున కల్యాణ లక్ష్మి స్కీమ్‌ను ఎంత మంది తీసుకుంటున్నారు? గతంలో ఎంత బడ్జెట్? తులం బంగారం అదనంగా ఇవ్వడం వల్ల అయ్యే అదనపు ఖర్చు ఎంత? అనే అంశాలపై వెంటనే అంచనా రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.
ఈ స్కీమ్ అమలుపై పంచాయితీ రాజ్, మహిళా శిశు సంక్షేమం, ఫైనాన్స్ విభాగాల అధికారులు కూడా అభిప్రాయాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు ఇందిరమ్మ కానుకపై అధ్యయనం మొదలు పెట్టారు. బడ్జెట్ ప్రణాళిక సిద్ధమై, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే నూతనంగా పెళ్లైన మహిళలకు అందజేయనున్నట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు కూడా ఈ స్కీమ్ అంచనాపై లెక్కలు వేస్తున్నారు. పూర్తి స్థాయి అంచనా తయారైన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
స్కీమ్స్ సవరణ...?
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన స్కీమలనూ సవరించనున్నట్లు తెలిసింది. స్కీమ్ ఇంప్లిమెంట్ ను పకడ్బదీగా అమలు చేసేందుకు పేర్లను సవరించడమే కాకుండా, టెక్నాలజీ తో ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులోకి తీసుకున్నారు. రైతు బంధును రైతు భరోసా, ఓవర్సీస్ స్కాలర్ షిప్ లను అంబేద్కర్ అభయ హస్తం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పథకంలో ఇందిరమ్మ ఇండ్లు, బీసీ, దళితబంధులను స్థానాల్లోనూ కొత్త స్కీమ్ లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను మెజారిటీ ప్రజలకు మేలు చేసేలా స్కీమ్స్ రూపంలో తీసుకువస్తామని ఓ మంత్రి తెలిపారు.
గతంలో బడ్జెట్ ఇలా..
గత సర్కార్ కల్యాణ లక్ష్మి పేరిట ఈ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయగా,2014 –-15 లో రూ. 230 కోట్లు, 2016–17 లో రూ.738 కోట్లు, 2018 లో రూ.1,450 కోట్లు, 2021 సెప్టెంబరు లో రూ.5,556.54 కోట్లు, 2023–24 లో రూ. 2 వేల కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది వరకు ఈ పథకానికి 13,18,983 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 11,62,917 మందికి అందినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదనంగా తులం బంగారం కూడా యాడ్ చేయడంతో బడ్జెట్ ను రెట్టింపు స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.