- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TG: గ్లోబల్ టెండర్ల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రాజెక్టుల రిజర్వాయర్లలో పూడికతీత పనుల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులు పారదర్శకంగా జరగడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించినట్లుగా నిర్ణీత కాలవ్యవధిలో పూర్తికావడానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది. ఈపీసీ పద్దతిలో టెండర్లను ఆహ్వానించి ఖరారు చేయాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ కోసం ఇటీవల ముగ్గురు మంత్రులతో ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలో ఒకేసారి పూడికతీత పనులను చేపట్టాలని, ఇందుకు పలు విభాగాల మధ్య పకడ్బందీ సమన్వయం ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సహా ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ డెవలప్‌మెంట్ విభాగాలకు చెందిన అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల జలాశయాల్లో పూడిక గణనీయంగా పెరిగిపోయిందని, ఫలితంగా నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయని, పూడికను వెలికితీయడం ద్వారా డ్యామ్‌లు, బ్యారేజీలు పటిష్టంగా ఉండడంతో పాటు లక్ష్యానికి అనుగుణంగా నీటి సామర్ధ్యాన్ని ఉంచుకోవచ్చని ప్రభుత్వం భావించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై గత వారం సమావేశమైన ఈ కమిటీ... సోమవారం మరోసారి సమావేశపై లోతుగా సమీక్షించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈపీసీ విధానంలో చేపట్టడం ద్వారా నిర్ణయించిన సమయానికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, పనుల్లోనూ అవకతవకలు లేకుండ పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నది. పూడికతీత సమయంలో ఇసుక, మట్టి, ఖనిజాలు కూడా వెలికి రానున్నందున వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని నిర్వహణకు వినియోగించవచ్చని సూచించింది.
జలాశయాల్లో వీటి మోతాదు ఏ మేరకు ఉన్నదో ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యయనం చేసి ప్రభుత్వానికి అంచనాలతో నివేదికను సమర్పించాలని, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఆర్జించిపెట్టేలా ఉండాలని సంబంధిత అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. టెండర్లు ఖరారైతే రాష్ట్రవ్యాప్తంగా పూడికతీత పనులు అన్ని రిజర్వాయర్లలో ఒకేసారి మొదలైతే అనుకున్న సమయానికి కంప్లీట్ అవుతాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఇసుక, మట్టి, ఖనిజాల విక్రయం ద్వారా సమకూరే రెవెన్యూతో నిర్వహణ పనులు జరుగుతాయని, తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందన్నారు.