- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో సమగ్ర కులగణనపై జీవో జారీ
దిశ, వెబ్‌డెస్క్: సమగ్ర కులగణన(Caste Census)కు తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే, తాజాగా.. ఈ సమగ్ర కులగణన విషయంలో ప్రభుత్వం(Telangana Government) మరో కీలక ముందడుగు వేసింది. కులగణనకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవో జారీ చేసింది. సర్వే బాధ్యతను ప్రణాళికశాఖకు అప్రగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలోని ప్రజలందరి వాస్తవ స్థితిగతులు, వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించడానికి వీలుగా ఈ కులగణనను చేపట్టనున్నారు.