- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: ఇకపై వారు ఉద్యోగులు కారు.. జేపీఎస్‌ల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది. అన్ని పంచాయతీల్లో శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకల్లా విధులకు హాజరుకాని పంచాయతీ సెక్రటరీల వివరాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు సేకరించాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. విధులకు హాజరుకాని జేపీఎస్‌లు ఇక ఎంతమాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కారని నొక్కిచెప్పారు. వారి టర్మ్ ముగిసినట్లుగానే ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు (లోకల్ బాడీస్), జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్ల (డీపీఓ)తో కొత్త సచివాలయం నుంచి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సీఎస్ పై క్లారిటీ ఇచ్చారు.
విధులకు హాజరుకాని జేపీఎస్‌లకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదనే స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ నెల 8న స్పష్టమైన నోటీసు ఇచ్చి 9వ తేదీ సాయంత్రం 5.00 గంటలకల్లా విధుల్లో చేరాల్సిందిగా డెడ్‌లైన్ పెట్టిందని, లేదంటే వారిని టెర్మినేట్ చేస్తామని హెచ్చరించిందని సీఎస్ గుర్తుచేశారు. విధులకు హాజరుకాని జేపీఎస్‌లతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేనప్పుడు ఇక వారిని టెర్మినేట్ చేయాల్సిన అవసరమూ ఉండదని ఆమె స్పష్టం చేశారు. గైర్హాజరైన పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు, డీపీవోలకు ఆమె నొక్కిచెప్పారు. విధులకు హాజరుకాని పంచాయతీల్లో స్థానికంగా పట్టభద్రులై ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యూత్‌ను గుర్తించి తాత్కాలిక పద్ధతిలో పంచాయతీ సెక్రటరీలుగా రిక్రూట్ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు విధులకు హాజరుకాని పంచాయతీ సెక్రటరీల జాబితాను కలెక్టర్లు, డీపీవోలు ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.