Gulf Workers: చారిత్రాత్మక నిర్ణయం! గల్ఫ్ కార్మికులకు నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎంతంటే?

by Ramesh N |   ( Updated:2024-10-08 15:32:13.0  )
Gulf Workers: చారిత్రాత్మక నిర్ణయం! గల్ఫ్ కార్మికులకు నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎంతంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ఇవ్వనున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన నిధుల కేటాయింపులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పంచుకున్నారు. గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు ప్రభుత్వం రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయించిందని, జిల్లా కలెక్టర్ల ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన జీవో పత్రాలను సచివాయంలో ఎన్‌ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్, ఇతర నేతలకు అందచేయడం జరిగిందని పేర్కొన్నారు. కాగా, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేసి.. ఎక్స్‌గ్రేషియా నిధులు కేటాయించడం తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం అని రేవంత్ సర్కార్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఈ ఎక్స్‌గ్రేషియా బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఏడు గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు వర్తిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed