- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘20 ఏండ్లుగా పనిచేస్తున్నాం.. ఇప్పటికైనా రెగ్యులరైజ్ చేయండి’.. సీఎం రేవంత్ రెడ్డికి వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని, అయినా గత ప్రభుత్వం క్రమబద్ధీకరించలేదని, ఇప్పటికైనా రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆన్ లైన్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. జూనియర్, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఇంకా క్రమబద్ధీకరణ కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులు దాదాపు వెయ్యి మందికి పైగా ఉంటారని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని వారు ఆ వినతిలో పేర్కొన్నారు. జీవో నంబర్ 16 ప్రకారం ఈ ఏడాది మే 3వ తేదీన కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించారని, కానీ అధికారుల సమన్వయ లోపం వల్ల, సరైన సమాచారం లేకపోవటం వల్ల, ఎన్నికల కోడ్ వల్ల వెయ్యి మంది పైగా కాంట్రాక్ట్ అధ్యాపకులు క్రమబద్ధీకరణ జరగలేదని వారు పేర్కొన్నారు. 20 ఏండ్లుగా వారు పనిచేస్తున్నారని, వారికి న్యాయం జరిగేలా చూడాలని వినతిలో పేర్కొన్నారు.