Fisheries : కర్ణాటక పర్యటనకు తెలంగాణ ఫిషరీస్ అధ్యయన బృందం

by Y. Venkata Narasimha Reddy |
Fisheries : కర్ణాటక పర్యటనకు తెలంగాణ ఫిషరీస్ అధ్యయన బృందం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఫిషరీస్(Telangana Fisheries) డిపార్ట్మెంట్ అధ్వర్యంలో చేపల పెంపకం, విక్రయంకు సంబంధించి అధ్యయనం చేసేందుకు తెలంగాణ అధికారుల బృందం(study) కర్ణాటక(Karnataka)లో పర్యటించనుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఆదివారం నుంచి ఈ నెల 13వరకు కర్ణాటకలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య కార్మికుల జీవనోపాధి, వారి ఆదాయం అభివృద్ధికి నూతన పాలసీ తేవాలని నిర్ణయించింది. నూతన పాలసీ రూపకల్పనలో భాగంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ బృందం పర్యటించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

రాష్ట్రంలో మత్స్యరంగంలో ఉన్నత విద్యావకాశాలు, ఫిషరీస్‌, ఆక్వాకల్చర్‌ రంగాల్లో ఉద్యోగాల కల్పన వంటి అంశాలను కూడా అధ్యయనం చేస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో తెచ్చిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అవినీతి మయమైందని, రెండు ఇంచులు కూడా లేని చేప పిల్లలను అందిస్తు ప్రభుత్వ సొమ్మును ఆంధ్రాకాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 570 మంది మత్స్యకారులు చనిపోతే ఎక్సగ్రెషియా ఇవ్వలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో మెరుగైన నూతన ఫిసరీస్ పాలసీ తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed