రాజ్‌భవన్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!

by GSrikanth |   ( Updated:2023-06-02 01:45:46.0  )
రాజ్‌భవన్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవతరణ ఉత్సవాలను గవర్నర్ రాజ్‌భవన్‌లో జరపనున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలకు ఆమెను ఆహ్వానించకపోవడంతో అధికారిక బంగళాలోనే జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమం తర్వాత ప్రజలు, ప్రజా సంఘాలు, సొసైటీలు, ట్రస్టులకు చెందిన ప్రతినిధులతో ఆమె ఉదయం 11 గంటల వరకు ముచ్చటించనున్నారు. రాష్ట్ర అవతరణ రోజునే ఆమె పుట్టినరోజు కావడంతో ప్రధాని మోడీ ఇప్పటికే ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: ప్రజాస్వామ్యంలో ఈ పోకడ సరికాదు!

Advertisement

Next Story