డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

by Prasad Jukanti |   ( Updated:2024-04-02 13:17:23.0  )
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ-2024 పరీక్షల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. 11,062 టీచర్ పోస్టు భర్తీ కోసం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్ లైన్ లో అప్లికేషన్ల ఫీజు చెల్లించేందుకు గడువు ఏప్రిల్ 2 వరకు, దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపుకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా గడువును పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం వచ్చే జూన్ 20 వ తేదీ వరకు ఛాన్స్ కల్పించారు. దీంతో అభ్యర్థులు రూ. 1000 చొప్పున అఫ్లికేషన్ ఫీజు చెల్లించి జూన్ 20 రాత్రి 11:50 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.

కాగా జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆ డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి పోస్టుల సంఖ్యను 11,062కు పెంచి సీఎం రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed