- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త అవతారమెత్తిన డీహెచ్ శ్రీనివాస్ రావు.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు!
దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరో సారి కొత్త అవతారమెత్తారు. ఆఫీసర్ హోదాలో క్లాస్‌గా ఉండే వ్యక్తి, ఖాకీ చొక్కా వేసి కార్మికుని గెటప్‌లోకి మారిపోయారు. సోమవారం మే డే ఉండడంతో, ఆదివారమే శ్రమశక్తి పేరిట కొత్తగూడెంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే గెటప్‌లో ర్యాలీ తీసి, ముఠా మేస్త్రి తీరు వీధుల్లో తిరిగారు. ఈ తిప్పలన్నీ ఎమ్మెల్యే కావాలనే తన కలను నిజం చేసుకోవడానికే అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గతంలోనూ తన వ్యాఖ్యలు, చర్యలతో డీహెచ్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడీ కొత్త వేషంతో మరోసారి ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
ఆఫీసర్‌గా ఉండే ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రజల నోళ్లలో ఉండేందుకు నాయకులకు ఇలాంటివి తప్పవని పొలిటికల్ సర్కిళ్లలో చర్చించుకుంటున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం కేసీఆర్ ఆయనను అడ్డుకోకపోవడం, ప్రగతిభవన్ ఇస్తున్న లీకుల్లో కొత్తగూడెం అభ్యర్థిగా డీహెచ్ పేరు ఉండడంతో కొత్తగూడెం బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా ఆయనకు సహకరిస్తున్నాయి. కొత్త కొత్త గెటప్‌లు, కార్యక్రమాలతో డీహెచ్ కూడా తన ప్రయత్నాలను విస్తృతం చేయడం వివాదానికి తెరలేపుతున్నాయి.