1200 మంది కళాకారులతో సీఎంకు గ్రాండ్ వెల్‌కమ్.. ఏర్పాట్లపై DGP సమీక్ష

by GSrikanth |   ( Updated:2023-08-11 14:33:02.0  )
1200 మంది కళాకారులతో సీఎంకు గ్రాండ్ వెల్‌కమ్.. ఏర్పాట్లపై DGP సమీక్ష
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఈనెల 15న చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్​శుక్రవారం ఏర్పాట్లపై వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. 15న ముఖ్యమంత్రి కేసీఆర్​అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్​సూచించారు.

సందర్శకుల కోసం ఎల్ఈడీ స్ర్కీన్లు

స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యేవారు సభా ప్రాంగణానికి ఎంత దూరంలో ఉన్నా కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్​అశోక్​రెడ్డి తెలిపారు. కార్యక్రమం లైవ్​కవరేజీ కోసం 10 కెమెరా యూనిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. అలాగే లైవ్​లింకింగ్​ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఇక, సభకు వచ్చే అతిధులు, అధికారులు, సందర్శకులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్​జలమండలి ఆధ్వర్యంలో లక్ష వాటర్​ప్యాకెట్లు, 25వేల వాటర్​బాటిళ్లను అందచేయనున్నట్టు ఆ సంస్థ ఎండీ దానకిషోర్​చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో నాలుగు అంబులెన్సులు, గోల్కొండ ప్రైమరీ హెల్త్​సెంటర్‌లో ఓ గదిని సిద్ధంగా ఉంచామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇక, మూడు ఫైరింజన్లు, ఆరు బెస్ట్​బైకులు, నాలుగు ల్యాడర్లను ఏర్పాటు చేయనున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. వర్షం పడినా విద్యుత్​సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక జనరేటర్లు, వాటర్​ఫ్రూఫ్​షెడ్లను ఏర్పాటు చేయనున్నట్టు విద్యత్​శాఖ, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 12వందల మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్​హరికృష్ణ చెప్పారు.

పార్కింగ్​ ఏర్పాట్లు...

సమీక్ష సందర్భంగా పార్కింగ్ ఏర్పాట్లపై డీజీపీ అంజనీకుమార్​ఆరా తీశారు. మొత్తం 1,930 వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టు హైదరాబాద్​ట్రాఫిక్​అదనపు కమిషనర్​సుధీర్​బాబు తెలిపారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీడియా వారికి, సందర్శకులకు వేర్వేరుగా పార్కింగ్​స్థలాలు కేటాయించినట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్​ఏర్పాట్లు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్​పోలీస్​కమిషనర్​సీ.వీ.ఆనంద్, అదనపు డీజీ స్వాతి లక్రా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​దేవసేన, ప్రొటోకాల్​డైరెక్టర్​అరవింద్​సింగ్, టూరిజం కార్పోరేషన్​ఎండీ మనోహర్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed