గోల్కొండ కోటలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Seetharam |
Kishan Reddy
X

దిశ,వెబ్‌డెస్క్: గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క వ్యక్తి ద్వారా తెలంగాణ సాధ్యం కాలేదని..ఎంతో మంది ఉద్యమ కారుల త్యాగాల ద్వారా మాత్రమే సాధ్యమైందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే రాష్ట్రం వచ్చిందని చెప్పారు. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్‌ని గుర్తు చేసుకున్నారు. సుష్మాస్వరాజ్ తెలంగాణ కోసం పోరాడారు అని అన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంటే ..మరోవైపు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను గోల్గొండ కోటలో నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున అజాది కా అమృత్ హహోతోత్సవంలో భాగంగా గోల్కొండ కోటలో నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ వేడుకలకు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed