అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి.. సీఎస్ శాంతికుమారి

by Javid Pasha |   ( Updated:2023-04-14 11:13:09.0  )
అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి.. సీఎస్ శాంతికుమారి
X

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలంగాణ సీఎస్ శాంతికుమారి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని రూ.146 కోట్లతో నిర్మించి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఓ అధికారిగా ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న అంబేద్కర్ సూక్తి ప్రతి ఒక్కరికీ ఆచరణీయమన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సీఎస్ అన్నారు. ఇక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని, అలాగే రైతు బంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి అనేక స్కీములతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లుతున్నారని అన్నారు. బౌద్ధభిక్షువులకు సీఎస్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story