- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలకు ముందే గులాబీ బాస్ మాస్టర్ స్కెచ్.. టీకాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ కొత్త కొత్త ఎత్తులు వేస్తోంది. గతంలో రెండు పర్యాయాలు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎన్నికలకే ముందే కాంగ్రెస్ అభ్యర్థులతో బీఆర్ఎస్ బేరసారాలు కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. కచ్చితంగా గెలుస్తారనుకొనే నేతలతో ముందు నుంచే టచ్‌లో ఉండి.. వారికి అవసరమైతే డబ్బును సమకూర్చేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం వారిని బీఆర్ఎస్‌లో చేర్చుకొనేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయం ముందే పసిగట్టిన కాంగ్రెస్ హైకమాండ్ కూడా అలర్ట్ అయినట్టు సమాచారం. తమ పార్టీ నేతలు చేజారిపోకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్టు చేసుకుంటున్నట్టు టాక్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరపున గెలిచే అభ్యర్థులను ఇప్పట్నుంచే మచ్చిక చేసుకోవాలనేది బీఆర్‌ఎస్ వ్యూహంగా తెలుస్తోంది.ఫలితాల అనంతరం సదరు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్కండువాలు కప్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఎంత కావాలి?
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్గ్రాఫ్పెరిగింది. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్పెరుగుతున్నట్లు బీఆర్ఎస్సర్వేలో తేలినట్టు సమాచారం. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో తమ పార్టీకి నష్టంగా బీఆర్ఎస్భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్కూడా కాంగ్రెస్‌వైపు మళ్లే ఛాన్స్ఉన్నది. ఇది కంటిన్యూ అయితే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యే చాన్స్ ఉంది. అందుకే బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఆకర్ష్కాంగ్రెస్పేరిట నేతలకు ఇప్పట్నుంచే గాలం వేస్తున్నారు. ప్రజల్లో గ్రాఫ్ఉన్న కాంగ్రెస్లీడర్లతో అంతర్గతంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనే యోచనలో బీఆర్‌ఎస్ ఉన్నది. అవసరమైతే ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టేందుకు కూడా సిద్ధమేనంటూ పలువురి కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే సంకేతాలు అందినట్లు సమాచారం. ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
గతంలో ఇదే విధానం...
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బీ–ఫామ్‌మీద గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఆర్థిక, పదవులు, పైరవీల హామీలతో చేరినట్లు గతంలో కాంగ్రెస్‌పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా 2018 మళ్లీ 12 మంది కాంగ్రెస్ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి చేరారు. పెద్దమొత్తంలో ఆర్థిక లాభంతో పాటు పదవులు ఆశ, స్వలాభం కోసం అధికార పార్టీలోకి వెళ్లినట్లు కాంగ్రెస్‌పార్టీ స్పీకర్‌తో పాటు పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. అయితే రెండు టర్మ్‌లో బీఆర్ఎస్సులువుగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలను లాగడం ఈజీగా మారింది. కానీ ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్బీఆర్ఎస్ అనే స్థాయిలో ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్అభ్యర్ధులకు ఎర వేయడం అంత సులువు కాదనేది పొలిటికల్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంటే.. సదరు నేతలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం లేదన్న విశ్లేషణ కూడా సాగుతోంది.