Delhi: తెలంగాణ మేనిఫెస్టోపై ఢిల్లిలో చర్చ.. టీ కాంగ్రెస్ నేతలకు ఖర్గే కీలక సూచనలు

by srinivas |   ( Updated:2023-08-20 11:06:45.0  )
Delhi:  తెలంగాణ మేనిఫెస్టోపై ఢిల్లిలో చర్చ.. టీ కాంగ్రెస్  నేతలకు ఖర్గే కీలక సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ ఢిల్లీలో ముగిసింది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను రాష్ట్ర నేతలు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. చేవెళ్ల సభ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై చర్చించారు. దళితులు, గిరిజనులకు ఏఏ అంశాల పెట్టాలనేదానిపైనా ఖర్గేకు వివరించారు. అలాగే రాజకీయ, ఆర్థిక అంశాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ నెల 26న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఆ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను మల్లిఖార్జున ఖర్గే ప్రకటిస్తారని తెలిపారు.


వచ్చే ఎన్నికల్లో విడుదల చేయాల్సిన మేనిఫెస్టోపైనా ఈ భేటీలో చర్చకు వచ్చింది. ఇందుకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఖర్గే దిశా నిర్దేశం చేశారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఇష్టమొచ్చినట్లు హామీలు ఇవ్వొద్దని తెలిపారు. తొలుత రాష్ట్ర బడ్జెట్‌ను అధ్యయనం చేయాలని, అందుకు అనుగుణంగా హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలకు ఖర్గే సూచించారు.

Advertisement

Next Story