- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టు జడ్జి మెంట్ రాకముందే.. రాహుల్‌ను ఎలా సస్పెండ్ చేస్తారు?
దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్‌గాంధీ అనర్హత వేటుపై లోక్‌సభ స్పీకర్కనీసం వివరణ అడిగే ప్రయత్నం చేయలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కిగౌడ్ అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో అత్యంత దారుణాలు జరుగుతున్నాయన్నారు. కోర్ట్జడ్జ్ మెంట్ సస్పెండ్‌లో ఉండగా, రాహుల్‌ను ఎలా సస్పెన్షన్చేస్తారంటూ? ప్రశ్నించారు. మోడీ, అమిత్‌షాలు అప్రజాస్వామికంగా వెళ్తున్నారన్నారు. అదానీతో మోడీకి ఉన్న వ్యాపార సంబంధాలు ఏంటో బయట పెట్టాలని? డిమాండ్‌చేశారు.
ఎల్ఐసీ, ఎస్సీఐకి జరిగిన నష్టంపై బీజేపీ నేతలు మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బీజేపీ రాహుల్ గాంధీపై తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు. గుజరాత్‌లో మోడీ క్యాబినెట్‌లో శిక్ష పడ్డ వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగారో? మోడీకే తెలియాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు వీ.హనుమంతరావు మాట్లాడుతూ.. ఉరి శిక్షవేసే వాళ్ళను కూడా ఆఖరి కోరిక ఏమిటని అడగాలనేది? చట్టాల్లో ఉన్నదని, కానీ రాహుల్‌గాంధీకి వివరణ ఇచ్చే సమయాన్ని ఇవ్వకపోవడం వెనక మోడీ పాత్ర ఉన్నదన్నారు. రాహుల్‌కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి మోడీ తట్టుకోలేకపోతున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నిరంజన్, వినోద్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, అజ్మతుల్లా హుసేన్ తదితరులు పాల్గొన్నారు.