Harish Rao: పార్టీ నడుపుతున్నారా? రౌడీ ముఠానా.. హరీశ్ రావుకు టీ కాంగ్రెస్ కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-11-12 06:28:00.0  )
Harish Rao: పార్టీ నడుపుతున్నారా? రౌడీ ముఠానా.. హరీశ్ రావుకు టీ కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో (Lagacharla village) ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ విషయంలో నిన్న అధికారులపై జరిగిన దాడి ఘటనపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్ లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు టీ కాంగ్రెస్ (T Congress) కౌంటర్ ఇచ్చింది. ఎక్స్ వేదికగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు టీ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మంగళవారం స్పందించింది. ' ఆవగింజంతైనా సిగ్గు లేదా హరీశ్ గారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీ నడుపుతున్నారా? లేక రౌడీ ముఠాను నడుపుతున్నారా? ఫామ్ హౌస్ లో కూర్చుని కేసీఆర్ (KCR) ఇలాంటి కుట్రలకు ప్లాన్ చేస్తున్నాడా అంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ముఠాతో పక్కా ప్లాన్ చేసి అధికారులను గ్రామాలకు రప్పించి, రాళ్ళతో కొట్టించి శునకానందం పొందడమే కాకుండా సమర్దిస్తున్నావా? అంటూ హరీశ్ రావును నిలదీసింది.

Read More: Lagcherla : లగచర్ల గ్రామస్థుల అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు

Next Story