- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘టీఎస్పీఎస్సీ అక్రమాల వెనుక MLC కల్వకుంట్ల కవిత!’
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీలో అక్రమాల వెనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని టీకాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపించారు. తాజాగా వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలతో పాటు 2016 గ్రూప్-1 పరీక్షలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని వీటిలో కవిత పాత్ర ఉందని బక్క జడ్సన్ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకోవడంతో గతంలో అర్హత లేని వారికి గ్రూప్-1 ఉద్యోగాలు వచ్చాయని దీనిపై విచారణ చేపట్టాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని కవిత సుప్రీంకోర్టుకు వెళ్లింది. అందువల్ల కవితను బహిరంగంగా విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ఈడీని కోరారు.
ఢిల్లీలో ఉన్న ప్రగతి మైదానంలో గానీ లేదా హైదరాబాద్‌లో ఉన్న ఎల్బీ స్టేడియం, జింఖానా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్‌లో ఎక్కడైనా లైవ్ టెలికాస్ట్ పెట్టి కవితను ప్రశ్నించాలన్నారు. అలాగే ఈ కేసులో మిగతా నిందితులతో కవిత కలిసి ఉన్నప్పటి ఫోటోలు, ఈడీ వద్ద ఉన్న ఆధారాలను దేశ ప్రజలకు చూపించాలన్నారు. ఈ కేసు నుంచి కవితను తప్పించడానికి కొందరు బీజేపీలో ఉన్న నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ తో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాని ఒకరు కొట్టినట్లు చేస్తే మరొకరు ఏడ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
TSPSC కమీషన్ అక్రమలలో ఎమ్ఎల్సి కవిత పాత్ర మరియు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది అని బయపడుతున్నందుకు కవిత ను బహిరంగ విచారణ చేయాలని ఈడీ కి ఫిర్యాదు. pic.twitter.com/xVDe16X4JL
— Judson Bakka Official (@zson_bakka) March 17, 2023