- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ ఢిల్లీకి తెలంగాణ సీఎం.. పార్టీ పెద్దలతో ఆ విషయంపైనే కీలక చర్చ!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీ పయనానికి సిద్ధమవుతున్నారు. రేపు (బుధవారం) ఆయన రాజధానిలో అడుగుపెట్టనున్నారు. గురువారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొనేందుకే ఆయన హస్తిన వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమావేశం అనంతరం పార్టీ హై కమాండ్‌తో సమావేశమై తెలంగాణకు సంబంధించి కీలక విషయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతారని సమాచారం. అయితే రేవంత్ కేబినెట్ విస్తరణ గురించి హై కమాండ్‌తో చర్చించబోతున్నారనే వార్తలు రావడంతో రాష్ట్ర కేడర్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశపడుతున్న ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురించాయి. విస్తరణ జరిగితే కొత్త మంత్రి పదవులు దక్కించుకునేందుకు కొంతమంది ఇప్పటినుంచే ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నిజానికి హర్యానా ఎన్నికల ముందే రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి. అయితే పార్టీ అధిష్ఠానం ఫోకస్ అంతా హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికలపై ఉండడంతో అది సాధ్యం కాలేదు. ఇక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఓటమి ఎదురవడంతో అధిష్ఠానం అంతర్మథనంలో పడింది. దీంతో రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. ఇలాంటి టైంలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరగనుండడంతో ఇది మంచి అవకాశంగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయంపై పార్టీ పెద్దలతో కచ్చితంగా చర్చిస్తారనే మాట వినిపిస్తోంది.