నేడు తిరుపతికి తెలంగాణ CM రేవంత్ రెడ్డి

by Rajesh |   ( Updated:2024-05-21 05:58:33.0  )
నేడు తిరుపతికి తెలంగాణ CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తన మనవడి తల నీలాల సమర్పించేందుకు సీఎం కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేసి.. రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ రానున్నారు. అయితే నేడు సీఎం రేవంత్ హైదరాబాద్ బషీర్ బాగ్‌లో పరిశ్రమల భవన్ కు వెళ్లనున్నారు. పరిశ్రమలపై రివ్యూలో భాగంగా నేతలతో చర్చిస్తారు. ఈ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ తిరుపతి బయల్దేరి వెళ్తారు.

Advertisement

Next Story