- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG News : ఈనెల 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

దిశ, వెబ్ డెస్క్ : బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఈనెల 6న కేబినెట్ మీటింగ్(Cabinet Meeting) నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC Reservation Bill), ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ(PM Modi)తో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా.. వాటిపై కేబినెట్ లో సీఎం చర్చించనున్నారు. అదే విధంగా మార్చ్ 8న మహిళా దినోత్సవాన్ని(Women's Day) పురస్కరించుకొని మహిళలకు లబ్ది చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకు రానున్నట్టు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయా పథకాలపై కూడా ఈ బేటీలో చర్చించనున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈనెల 2వ వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంశాలు కూడా ఈ చర్చలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయనున్నారు. ఈ బిల్లుకు ఎలాగైనా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు(Local Body Elections) వెళ్లాలని సర్కార్ ధృడ నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే.