ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైడ్రా, పలు అంశాలపై చర్చలు!

by Ramesh N |   ( Updated:2024-09-14 06:43:42.0  )
ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైడ్రా, పలు అంశాలపై చర్చలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మీటింగ్‌లో వరద నష్టం, హైడ్రాకు చట్టబద్ధత, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది. చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటుచేసిన హైడ్రాపై నిన్న హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీంతో హైడ్రాకు చ‌ట్టబ‌ద్ధత‌, హైకోర్టులో కౌంటర్ దాఖలు అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed