Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-12 12:32:03.0  )
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు ఆమోదముద్ర వేసింది. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్.. రూ.1658 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారమే ప్రధాన అజెండాగా కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోళ్లపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.

Advertisement

Next Story