- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెనకడుగు వేసిన తెలంగాణ బీజేపీ.. వర్క్‌షాప్‌లో కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటై డిసెంబర్ నాటికి ఏడాది పూర్తిచేసుకోనున్న సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయింది. అందుకుగాను తొలుత పాదయాత్ర చేపట్టాలని భావించినా ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. పాదయాత్రలకు బ్రేక్ ఇచ్చింది. కేవలం నిరసనలకే పరిమితం కావాలని చూస్తోంది. బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, చార్జ్‌షీట్లు విడుదల చేయాలని చూస్తోంది. ఇటీవల బీజేపీ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రలను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చేపట్టాలని తొలుత కాషాయ పార్టీ నిర్ణయించినా? చివరకు వెనుకడుగు వేసినట్టు సమాచారం.
పార్టీకి ప్రశ్నార్థకంగా పాదయాత్ర బాధ్యతలు!
పాదయాత్రలు చేస్తే ఎవరు చేయాలి? ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారు చేయాలా? లేక టికెట్ ఆశించిన వారికి ఆ బాధ్యత అప్పగించాలా? అన్నది పార్టీకి ప్రశ్నార్థకంగా మారినట్టు సమాచారం. అందుకే పాదయాత్ర ఆలోచనకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన పలువురు పార్టీని వీడారు. మరి అలాంటి సెగ్మెంట్లలో యాత్ర ఎవరు చేపట్టాలనే ప్రశ్నలు ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు, చిక్కుముడులను అధిగమించి యాత్ర చేపట్టడం కష్టమని భావించి పాదయాత్ర నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది. పార్టీలో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. పాదయాత్రలు నిర్వహిస్తే ముఖ్య అతిథిగా తమకు నచ్చిన నేతను ఆహ్వానిస్తే మరో నేతతో తమకున్న రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉండటంతో శ్రేణులు సైతం సందిగ్ధంలో పడటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు టాక్.
వచ్చే నెల 5న ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్‌షీట్
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏడాది వైఫల్యాలపై బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలు, చార్జ్‌షీట్ విడుదల చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని వచ్చే నెల 1వ తేదీ నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కమలం పార్టీ డెసిషన్ తీసుకుంది. డిసెంబర్ 1న తేదీన మండలస్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. 2వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడయింది. 3న అసెంబ్లీ నియోజకవర్గకేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుచేయలేదని చార్జ్‌షీట్ విడుదల చేయాలని కమలదళం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రోగ్రామ్స్‌కు కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎవరు లీడ్ తీసుకోవాలని అయోమయ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. చార్జ్‌షీట్ ఎవరు ప్రిపేర్ చేయాలనే అంశాలపై సందిగ్ధత ఏర్పడినట్టు టాక్. మరి ఈ ఇబ్బందులను ఎదుర్కొని కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తుందనేది చూడాలి.