- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ ఫస్ట్ లిస్ట్.. అసెంబ్లీ బరిలో తెలంగాణ బీజేపీ ఎంపీలు.. ఎవరు ఎక్కడినుంచంటే..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ రూటు మార్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఆదివారం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మంది పేర్తతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఇందులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేర్లు ఉన్నాయి. కానీ కిషన్ రెడ్డి పేరు మాత్రం లేకపోవడం కీలకంగా మారింది.
మరోసారి కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేయనుండగా.. కోరుట్ల నియోజకవర్గం నుంచి ధర్మపురి అర్వింద్ పోటీలోకి దిగుతున్నారు. ఇక బోథ్ నుంచి సోయం బాపూరావు పేరు లిస్ట్‌లో ఉంది. కిషన్ రెడ్డి పేరు తొలి జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలి జాబితాలో పలువురు ముఖ్యనేతల పేర్లు మిస్ అయ్యాయి. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం.