ఏ క్షణమైనా చంద్రబాబు, రేవంత్ భేటీ రద్దు.. తెలంగాణ బీజేపీ నేత సెన్సేషనల్ కామెంట్స్

by srinivas |
ఏ క్షణమైనా చంద్రబాబు, రేవంత్ భేటీ రద్దు.. తెలంగాణ బీజేపీ నేత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇచ్చిన హామీలపై చర్చించేందుకు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవాలని తాము కోరుకుంటున్నామని, కానీ వారిద్దరి భేటీ ఏ క్షణంలోనైనా రద్దు కావొచ్చని ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు.


విభజన చట్టంలోని హామీలు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు వెళ్తే మంచిదేనని, అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పర్మిషన్ ఉందా అని ప్రశ్నించారు. అసలు ఆ మీటింగ్ జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒక కారణం చెప్పి చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఆపివేసే అవకాశాలున్నాయని తెలంగాణ బీజేపీ నేత ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed