- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేసీఆర్ సర్కార్ బురిడీ కొట్టించింది’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ ఒకే పనిని వేరువేరు పథకాల కింద కేంద్ర ప్రభుత్వానికి చూపి, వాటికి రెండుసార్లు నిధులు రాబట్టి, స్వాహా చేయడం షాక్‌కు గురి చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఇది పెద్ద కుట్ర, మోసం, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ రహదారుల పనులు, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలు సహా అన్ని ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసానికి పాల్పడడం దేశంలో ఇదే మొదటిసారని, బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కేవలం భారీ నీటిపారుదల ప్రాజెక్టులకే పరిమితం కాలేదంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన 6 రోడ్డు ప్రాజెక్టులలోనూ పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ రోడ్డు ప్రాజెక్టులను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం కింద ఒకసారి, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద రెండోసారి చూపి కేసీఆర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలను బురిడీ కొట్టించిందని వ్యాఖ్యానించారు. ఒకే పనికి రెండు వేర్వేరు మార్గాల ద్వారా నిధులు రావడంతో, రెట్టింపు నిధులు విడుదలయ్యాయని అన్నారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ పథకం కింద విడుదలైన రూ.4.44 కోట్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతుందని అయన వివరించారు.