ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

by GSrikanth |
ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఢిల్లీ పయనమయ్యారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీకానున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లపై చర్చించేందుకే వెళుతున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ పరంగా ఎవరినీ కలవడం లేదని, సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటానని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం వెనుక మరేదైనా మతలబు ఉందేమో అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story