- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని KCR ప్లాన్: బండి సంజయ్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను అధికారంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైతే బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేదం విధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు భగ్గుమన్నారు. అంతేకాకుండా బజరంగ్ దళ్ బ్యాన్ అంశం కర్నాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు బజరంగ్ దళ్ బ్యాన్‌పై కర్నాటక ఎన్నికల ప్రచారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటేసేటప్పుడు జై భజరంగ్ భళి అని నినదించి ఓటేయాలని మోడీ సూచించారు. దీంతో బజరంగ్ దళ్ బ్యాన్ అంశం ఎన్నికల సమయంలో కర్నాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.
కానీ, చివరకు కర్నాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. బజరంగ్ దళ్ బ్యాన్‌పై అంశం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ మారుతుందని బీజేపీ అంచనా వేసినప్పటికీ అలాంటిదేమి జరగలేదు. ఏకంగా ఏ పార్టీతో పొత్తు లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని కాంగ్రెస్ పార్టీ సాధించింది. బజరంగ్ దళ్ బ్యాన్ అంశం ఇంకా పూర్తిగా చల్లారక ముందే.. తెలంగాణలో బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని చూస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గురువారం నాగోల్‌లో జరిగిన ఓబీసీ మోర్చా కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఇప్పుడు బజరంగ్ దళ్‌ను నిషేధించాలనుకుంటున్నదని.. కర్నాటకలో కాంగ్రెస్ చేసిన పనిని ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నదేమో అని అన్నారు.
కర్నాటకలో ఈ అంశం కాంగ్రెస్‌కు కలిసి రావడంతో ఈ విషయాన్ని కేసీఆర్ పసిగట్టి ముందుగానే నిషేధం ప్రకటన చేయాలని చూస్తున్నారేమోనన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో పోటీపడుతున్న కేసీఆర్.. కాంగ్రెస్‌కు మైలేజీ రాకుండా ముందుగానే కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. కానీ తెలంగాణలో బజరంగ్ దళ్ హింసాత్మక చర్యలకు పాల్పడలేదని.. సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నదన్నారు. ఏ ముస్లిం వ్యక్తి లేదా సంస్థ తెలంగాణలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధించాలని కోరుకోవడంలేదని తెలిపారు. బజరంగ్ దళ్ అన్ని వర్గాలు సమానంగా ఉండాలని కోరుకుంటుదన్నారు. హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తే.. మతతత్వం అని అంటున్నారన్నారు. మైనారిటీలకు మేం వ్యతిరేకం అని మజ్లిస్, బీఆర్ఎస్ బద్నాం చేయాలనుకుంటున్నాయి బండి ఆరోపించాయి..
Also Read..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు