- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. 5 బిల్లులకు ఆమోదం
దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్ సమావేశాలు గత నెల 23న ప్రారంభం కాగా ఆగస్టు 2న ముగిసి నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు గత నెల 23న ప్రారంభం కాగా కౌన్సిల్ 24న ప్రారంభమైంది. అసెంబ్లీ మొత్తం తొమ్మిది రోజుల్లో 65.33 గంటల పాటు నడవగా కౌన్సిల్ మాత్రం ఆరు రోజుల్లో 20 గంటల పాటు నడిచింది. ఈ బడ్జెట్ సమావేశాలు గతంలో ఎన్నడూ లేనంత వాడివేడి వాదనలు, నిరసనలు, మార్షల్స్ రంగ ప్రవేశం, వాకౌట్‌లు, అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష సభ్యుల అరెస్టు, స్పీకర్ పోడియం దగ్గర ధర్నా, నేలపై కూర్చుని నిరసన, ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘనకు బీఆర్ఎస్ రిక్వెస్టు... ఇలా అనేక అనూహ్య పరిణామాలతో శుక్రవారం ముగిశాయి. ఉభయ సభల్లో ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చల అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలతో పాటు ఆమోదం లభించింది.
అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన మొత్తం 32 ప్రశ్నలకు సమాధానం లభించగా సమయాభావం కారణంగా మంత్రుల నుంచి మరో 8 ప్రశ్నలకు సమాధానం రాకపోవడంతో వాటిని సభ్యులకు లిఖితపూర్వకంగా అందజేయనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ సమావశాలు మొత్తం తొమ్మిది రోజుల పాటు జరగ్గా ప్రభుత్వం తరఫున ఒక తీర్మానం (రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాలేదని నిరసన)తో పాటు రెండు అంశాలపై (ధరణి, హైడ్రా) స్వల్పకాలిక చర్చ, మూడు ప్రత్యేక తీర్మానాలు (మోషన్స్), ప్రభుత్వం తరఫున ఒక స్టేట్‌మెంట్ (జాబ్ క్యాలెండర్) తదితర బిజినెస్ జరిగినట్లు స్పీకర్ తెలిపారు. మొత్తం 132 మంది సభ్యులు వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా ఎన్నికైనవారికీ ఈసారి సభలో మాట్లాడేందుకు అవకాశం లభించడం గమనార్హం.