- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: అసెంబ్లీ సమావేశాలు 9 రోజులు.. నేడు రెండు శాఖలతో భేటీ!
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు 9 రోజులకు ఫిక్స్ అయ్యాయి. ఈ నెల3న షురూ అయి 14వ తేదీన ముగుస్తాయి. మధ్యలో రెండు రోజులు ఆదివారం వస్తుండగా, బడ్జెట్ ప్రవేశపెట్టిన మరోసటి రోజూ సమావేశాన్ని కూడా వాయిదా వేయనున్నారు. అసెంబ్లీ సెషన్స్ ప్రోరోగ్ చేయకుండానే గత సమావేశాలకు కొనసాగింపుగా బడ్జెట్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఈసారి 8వ సెషన్ 4వ మీటింగ్ కాగా, శాసనమండలి 18వ సెషన్ 4వ మీటింగ్ అవుతుంది. ప్రభుత్వ గెజిట్ ప్రకారమే సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈనెల 3న మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజూ బీఏసీ భేటీలోనూ అసెంబ్లీ నిర్వహించే తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. 4న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. 5న ఆదివారం. తిరిగి 6న అసెంబ్లీలో 10.30 గంటలకు బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. 7న అసెంబ్లీ వాయిదా, 8న తిరిగి సమావేశాలు ప్రారంభమవుతాయి. 12న ఆదివారం, కాగా 13 , 14 తేదీల్లో సెషన్స్ ఉంటాయి.
ప్రోరోగ్ కాకుండానే..
2021 సెప్టెంబర్ నుంచి అసెంబ్లీ ప్రోరోగ్ కాకుండానే సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగానే గవర్నర్ ప్రసంగం లేకుండా సెషన్స్ కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా ఇదేవిధంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసి మరీ విత్ డ్రా చేసుకుంది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండానే గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలను షురూ చేస్తున్నారు.
నేడు రెండు శాఖలతో భేటీ
అసెంబ్లీ సెషన్స్ సజావుగా కొనసాగేందుకు బుధవారం సీఎస్ అసెంబ్లీ అధికారులతో ఒక భేటీ అవుతారు. శాంతి భద్రతలపై పోలీసు శాఖలతోనూ వేర్వేరు సమావేశాలను మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో తీసుకోవాల్సిన అంశాలపై పలు సూచనలు చేయనున్నారు. ఇవి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత జరగనున్నాయి.
Also Read...