- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేవైఎంలో తేజస్వి సూర్య చిచ్చు.. రెండుగా చీలిన స్టేట్ ఆర్గనైజేషన్!
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తల నొప్పి మొదలైంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య కారణంగా రాష్ట్ర బీజేవైఎంలో చీలక ఏర్పడింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ వర్సెస్ బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి అన్నట్లుగా మారింది. రెండు వర్గాలుగా రాష్ట్ర బీజేవైఎం చీలింది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం బీజేవైఎం వర్క్ షాప్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. కాగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన వద్ద బస చేయకుండా.. తేజస్వి సూర్య బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ సాయితో ఏర్పాటు చేసిన బస వద్దకు వెళ్లడాన్నిరాష్ట్ర బీజేవైఎం తప్పుపట్టింది.
ఇది రాష్ట్ర అధ్యక్షుడిగా తనను అవమానించినట్లేనని భానుప్రకాశ్ వర్గీయులు చెబుతున్నారు. ఓకే వర్గానికి కొమ్ము కాసే విధంగా తేజస్వి సూర్య వ్యహరిస్తున్నారని భాను వర్గం ఆరోపిస్తోంది. షెడ్యుల్ ప్రకారం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం వర్క్ షాప్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ రసాభాస కారణంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ అలిగి వెళ్లిపోయారు. వర్క్ షాపునకు తాను హాజరవ్వబోనంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి పార్టీలో ఏర్పడింది.
దీంతో వర్క్ షాప్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. భానుప్రకాశ్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి పార్టీ రాష్ట్ర నేత రాంచందర్ రావు దిగారు. ఇదిలా ఉండగా మల్కాజిగిరి టికెట్‌ను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌తో పాటు బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ఆశిస్తున్నారు. ఇక్కడే ఇద్దరికీ వర్గపోరు మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు తేజస్వి సూర్య రాక అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
కాగా బీజేవైఎం వర్క్ షాపునకు హాజరయ్యేందుకు తేజస్వి సూర్య ఇప్పటికే బీజేపీ కార్యాలయనికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా రసాభాస నడుమ బీజేవైఎం వర్క్ షాప్‌ను ప్రారంభించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ లేకుండానే సమావేశం ప్రారంభించడంపై యువమోర్చా జిల్లా అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భాను ప్రకాష్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.