- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘బోనులోంచి పులి బయటకు వచ్చింది’.. సస్పెన్షన్‌పై తీన్మార్ మల్లన్న టీమ్ రియాక్షన్ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)ను సస్పెండ్ చేస్తూ అధిష్టానం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని హెచ్చరించింది. నేటి వరకూ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ(Chairman of the Disciplinary Committee) చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి(Chinna Reddy) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సస్పెన్షన్‌పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన పత్రాలు తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించామని చెప్పారు. షోకాజ్ నోటీసుకు తీన్మార్ మల్లన్న సమాధానం ఇవ్వలేదని.. అన్ని అంశాలు పరిశీలించాకే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తీన్మార్ మల్లన్నే కాదు.. ఇక నుంచి పార్టీ లైన్ ఎవరు దాటినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు.. సస్పెన్షన్‌పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్(Teenmar Mallanna Team) సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. గతంలో ఆయన మాట్లాడిన పాత వీడియోను పోస్టు చేస్తూ.. ‘పులి బోన్‌లో నుంచి బయటకు వస్తే ఎట్లా వేటాడుతుందో చూపిస్తా’ అనే క్యాప్షన్ పేర్కొన్నారు. దానిపైన ‘ఏం పీక్కుంటారో.. పీక్కోండి’ అనే క్యాప్షన్‌ను సైతం జోడించారు.