- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Teenmar Mallanna : షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న ఫైర్

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే(Caste Census Survey)పై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)కు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం(Congress Disciplinary Committee) షోకాజ్ నోటీసు(Show Cause Notices) లు జారీ చేయడం పట్ల తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. నోటీసుల జారీ వ్యవహారంతో ఆగ్రహానికి గురైన మల్లన్న మరోసారి కాంగ్రెస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఎందుకు నోటీసులు ఇవ్వాలని ప్రశ్నించారు. పార్టీ ఏమన్నా.. మీ అయ్య జాగీరా..కాంగ్రెస్ పార్టీ మాది ..బీసీలది అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆ పార్టీని వాడుకుంటున్న మీరు పెత్తనం చేసుకుంటా నన్ను బెదిరించాలని..డమ్కీలు ఇస్తామంటే నడవదని హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరిగితే బీసీలు పండబెట్టి తొక్కుతారన్నారు. కులగణనపై ఏదో బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడుతా లేరంటున్నారని..అటువంటి ఎమ్మెల్యేల పని అయిపోయిందని..వారి పని జనమే చూసుకుంటారన్నారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు కులగణన సర్వే నివేదికను తప్పు అని చెప్పకుండా పారదర్శకమైందంటూ చెప్పడం దుర్మార్గమన్నారు. కులగణన సర్వే అగ్రకుల సర్వే అని..ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన డ్రామా అని..దీనికి ఎలాంటి అధికారికత...ప్రమాణికతలు లేవని మల్లన్న మరోసారి విమర్శించారు.
అంబర్ పేట తులసీనగర్ కాలనీలో 20వేల మంది ఉంటే అక్కడ సర్వేనే జరుగలేదని..గోల్నాకాలో, మల్కాజిగిరిల కూడా అదే పరిస్థితి అని..అందుకే ఇది ఫేక్ సర్వే అని..అన్ని దొంగ లెక్కలేనని..మా ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే సర్వే రిపోర్టును దగ్థం చేస్తామని స్పష్టం చేశారు. కులగణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని విమర్శించారు.
జానారెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నామని.. ఖబడ్ధార్ అని హెచ్చరించారు. నీవు చేసిన మోసం..కుట్రనే ఇదంతా అని మండిపడ్డారు, రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేసి 40లక్షల బీసీలను గల్లంతు చేశారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కావాలని..టికెట్లు కాదన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పదికాలల పాటు కాపాడుకోవాలన్న ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి లేదన్నారు.