- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపాధ్యాయ దినోత్సవ తేదీ మారుస్తాం.. ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3 వ తేదీన జరుపుతామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దేశంలో పేద వర్గాలు, మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా మహిళల, వితంతువుల చదువు కోసం అలుపెరగని కృషి చేసిన మొదటి తరం మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే అని, పేద వర్గాలకు చదువునందించే క్రమంలో ఎన్నో అవమానాలు, బెదిరింపులను ఫూలే దంపతులు ఎదుర్కొన్నారన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ వల్ల మెజారిటీ పేదలకు చదువు వచ్చిందని గాని, ఉపాధ్యాయుల పనీతీరు మెరుగైందని చెప్పడానికి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవని పేర్కొన్నారు.
Advertisement
Next Story