తెలుగు వారెక్కడ ఉంటే అక్కడ TDP జెండా ఉండాల్సిందే: టీడీపీ

by Satheesh |
తెలుగు వారెక్కడ ఉంటే అక్కడ TDP జెండా ఉండాల్సిందే: టీడీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు దేశం పార్టీ 42వ ఆవిర్భావ సభ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీ కీలక నేతలు హజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తెలుగు వారు ఎక్కడ ఉన్నా అక్కడ టీడీపీ జెండా ఉండాల్సిందే అన్నారు.

టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని చెప్పారు. ఈ సభలో మాట్లాడిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న తెలంగాణలో టీడీపీ ఎక్కడా అన్న వారికి ఈ ఆవిర్భావ సభ చెంపపెట్టు లాంటిది అన్నారు. ఏపీలో తెలుగు దేశం ఎక్కడ అన్నవారికి ఇటీవలే అక్కడ జబర్తస్త్ ఆన్సర్ ఇచ్చారని.. బిడ్డా తెలంగాణలోనూ తెలుగుదేశం వస్తోంది కాచుకోండి అని సవాల్ విసిరారు. అబ్ కి బార్ తెలంగాణకి బారి అంటూ కొత్త నినాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ తెలంగాణ అయితే రామారావుకు పట్టం కట్టి పార్టీ అభివృద్ధికి దోహదం పడిందో అదే తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్టీఆర్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు.

Advertisement

Next Story