- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telugu Desam Party : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్ని్కల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ రాష్ట్రంలో జరుగబోయే ప్రతీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని వెల్లడించారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే 300 మంది దరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు షేక్ ఆరీఫ్, జీవీజీ నాయుడు, అధికారప్రతినిధులు శ్రీనివాసులునాయుడు, మ్యాడం రామేశ్వరరావు, తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి మాట్లాడారు.
పార్టీకి ప్రజల్లో రోజురోజూకు ఆదరణ పెరుగుతుందని అది చూసి కొంతమంది పోటీ చేయడం లేదనే తప్పుడు ప్రచారం చేస్తూ నేతల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రచారం మానుకోవాలని, లేకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో టీడీపీ కింగ్ మేకర్ అవుతుందన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును రెండ్రోజుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భేటీ అవుతున్నారని, లిస్టుపై ఆమోద్ర పడగానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటిస్తామన్నారు. టీడీపీ బలపడితే తమకు నష్టం జరుగుతుందనే కొందరు పనిగట్టుకొని అసత్యప్రచారం చేస్తున్నారని మానుకోవాలని హితవు పలికారు.