- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీని వీడినవారంతా తిరిగి పార్టీలోకి రావాలి: కాసాని
దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీని వీడినవారంతా తిరిగి పార్టీలోకి రావాలని, బలోపేతం చేసుకుందామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, హుస్నాబాద్, కరీంనగర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జులను నియమించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా గంగాధర కనకయ్య, సిరిసిల్ల ఇన్చార్జీగా ఆపునూరి దయాకర్ రావు, చొప్పదండి ఇన్చార్జీగా జంగం అంజయ్య, హుస్నాబాద్ ఇన్చార్జీ గా బత్తుల శ్రీనివాస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని, పూర్వవైభవం తీసుకొద్దామన్నారు. పనిచేసేవారికి తగిన గుర్తి లభిస్తుందన్నారు. ప్రజల్లో టీడీపీ పట్ల అభిమానం ఉందని, వారి ముందుకు పోతే ఆదరిస్తారన్నారు. అందరూ సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బియ్యని సురేష్, కాసాని సాయి తదితరులు ఉన్నారు.