హుక్కా సెంటర్‌పై టాస్క్​ఫోర్స్​పోలీసుల దాడి

by GSrikanth |
హుక్కా సెంటర్‌పై టాస్క్​ఫోర్స్​పోలీసుల దాడి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్​జోన్​టాస్క్​ఫోర్స్​పోలీసులు హుక్కా సెంటర్‌పై మంగళవారం దాడి చేశారు. పెద్ద సంఖ్యలో హుక్కా పాట్లతో పాటు వేర్వేరు ఫ్లేవర్ల హుక్కా పొడి ప్యాకెట్లు, ఎనిమిదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​డీసీపీ రాధాకిషన్​రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తలాబ్​కట్ట ప్రాంతానికి చెందిన ఇమ్రాన్​(29) కొంతకాలం క్రితం నాంపల్లి యూసుఫైన్​దర్గా చౌరస్తాలో ఉన్న మెరీడియన్​హోటల్​పై అంతస్తులో దుబాయ్​షీషా లాంజ్​పేర హుక్కా సెంటర్​నడిపిస్తున్నాడు.

ఈ సెంటర్​ను నడిపించటంలో అతనికి మహ్మద్​సుల్తాన్, షేక్​ఎజాజ్, షేక్​సయీద్ సహకరిస్తున్నారు. కాగా, మైనర్లకు కూడా నిర్వాహకులు హుక్కా తాగే అవకాశం కల్పిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్సై నవీన్​కుమార్​మంగళవారం దీనిపై దాడి చేశారు. నిర్వాహకుడు ఇమ్రాన్​తప్పించుకుని పారిపోగా మిగితా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు హుక్కా సేవిస్తున్న పదమూడు మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story