చౌటుప్పల్ ఎంపీపీ ఇంటిని చుట్టుముట్టిన టాస్క్‌ఫోర్స్

by GSrikanth |   ( Updated:2022-08-16 05:21:46.0  )
చౌటుప్పల్ ఎంపీపీ ఇంటిని చుట్టుముట్టిన టాస్క్‌ఫోర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల ఎంపీపీ తాండూరు వెంకట్ రెడ్డి ఇంటిని టాస్క్‌ఫోర్స్ అధికారులు చుట్టుముట్టారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో భాగంగా విచారణ నిమిత్తం తమ వెంట రావాలని ఎంపీపీపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ అధికారులకు వెంకట్ రెడ్డి కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన స్థానిక బీజేపీ నేతలు వెంకట్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు. ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని తెలిసి తెరపైకి పాత కేసుల ప్రస్తావన తీసుకొస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

కాసేపట్లో జాతీయ గీతాలాపన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Advertisement

Next Story