క్వాలిటీ చెకింగ్‌కు త్వరలో టాస్క్ ఫోర్స్: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా

by Satheesh |
క్వాలిటీ చెకింగ్‌కు త్వరలో టాస్క్ ఫోర్స్: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ అందించేందుకు చొరవ చూపాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. బుధవారం ఆయన సెక్రటేరియట్‌లో ప్రైవేట్ వైద్య విద్య, డెంటల్ కళాశాలల యాజమాన్యాలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. హెల్త్ ఎడ్యుకేషన్‌కు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్‌గా గుర్తింపు ఇవ్వాలని సీఎం లక్ష్యమని, అందుకు సమిష్టి కృషి అవసరం అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలలతో పాటు డెంటల్ కాలేజ్‌లలో మెరుగైన వైద్య విద్యను అందించేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య విద్య అందించేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వైద్య రంగంలో ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు పూర్వ వైభవం తెస్తామన్నారు. గతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసుకున్న డాక్టర్లకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో మెరుగైన వైద్య విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైద్య విద్యలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతున్నామని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలకు తెలిపారు. ఏఈబీఏఎస్ విధానం అమలులో కొన్ని కళాశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మంత్రి నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ విమల థామస్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story