- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో గెలిచే స్థానాలపై తమిళి సై కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఎంపీ ఎలక్షన్‌లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుస్తున్నామని మాజీ గవర్నర్ తమిళి సై అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులతో సోమవారం తమిళి సై సమావేశమయ్యారు. అనంతరంబీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావడం, ప్రజలని కలవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలలో ప్రచారం చేస్తానని తమిళి సై అన్నారు. అధిష్టానం ఎక్కడ ప్రచారం చేయమంటే అక్కడ ప్రచారం చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు. ఫలితాల తరవాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులుగా ఉంటారని స్పష్టం చేశారు.
సౌత్ చెన్నైలో హోరా హోరీ పోటీ ఉంది.. కానీ గెలిచి తీరుతానని మాజీ గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు తీసివేసే ప్రసక్తే లేదని.. దీనిపై కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించింది ఎవరు? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో తాను బాధితురాలినే అన్నారు. తన కుటుంబం కూడా ఎమర్జెన్సీ బాధితుల్లో ఒకటే అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తన తండ్రిని అరెస్ట్ చేశారని. ఏడాది పాటు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. అప్పుడు తాము ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. అలాంటి పార్టీ కి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని ఫైర్ అయ్యారు. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు.