- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kamal Haasan: కొన్ని సినిమాలు గర్వపడేలా చేస్తాయి.. కమల్ హాసన్ ఎమోషనల్ ట్వీట్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ తెరకెక్కించిన ‘అమరన్’(Amaran) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యాక్షన్ సెంటిమెంట్ మిలిటరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, కమల్ ‘అమరన్’ విజయం సాధించడంపై స్పందిస్తూ X వేదికగా ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. ‘‘అమరన్(Amaran) సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి ఆదరణ దక్కింది. కొన్ని చిత్రాలు ఆనందాన్ని ఇస్తాయి. మరి కొన్ని గౌరవాన్ని తీసుకొస్తాయి. అమరన్ మూవీ ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తుంది. ఈ విషయం నేను సినిమా స్టార్ట్ అయినప్పుడే చెప్పాను.
దీనికోసం చిత్రబృందం సభ్యులు దాదాపు మూడేళ్లు శ్రమించారు. మంచి మూవీని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటారని నా నమ్మకం మరోసారి నిజమైంది. అమరన్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. అయితే ‘అమరన్’ సినిమాలో శివ కార్తికేయన్(Shiva Karthikeyan), సాయి పల్లవి జంటగా నటించారు. దీనిని తమిళ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి తెరకెక్కించగా.. సోనీ పిక్చర్స్(Sony Pictures) బ్యానర్‌తో కలిసి ప్రముఖ హీరో కమల్ హాసన్(Kamal Haasan) నిర్మించారు. ఈ సినిమా కార్గిల్ వార్‌లో మరణించిన మేజర్ ముకుంద్ జీవిత కథ ఆధారంగా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది.
திரையிட்ட இடங்களில் எல்லாம் அமரன் படத்திற்கு மகத்தான வரவேற்பு கிடைத்துள்ளது. நல்ல படத்தை மக்கள் கொண்டாடுவார்கள் எனும் எனது நம்பிக்கை உறுதியாகியுள்ளது. ரசிகர்களுக்கு என் நன்றி.#Amaran #MajorMukundVaradarajan @RKFI @turmericmediaTM pic.twitter.com/7mTzZ27sHs
— Kamal Haasan (@ikamalhaasan) November 1, 2024